సర్వేపల్లి లో గత నాలుగైదు సంవత్సరాలుగా సాగుతున్న అగ్రనేతల మాటల తూటాల పోరు తాజాగా ఉదయగిరి కి చేరింది. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి మద్దతుగా ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తనదైన శైలిలో చలోక్తులు విసురుతూ కాకాణి గోవర్ధన్ రెడ్డికి మద్దతు గా వేసిన పంచ్ లు పటాసులై పేలాయి.
ఉదయగిరిలో మాటల తూటాల కు శ్రీకారం చుడుతూ శేఖర్ రెడ్డికి వ్యతిరేకంగా మాజీ ఎంపీపీ డాక్టర్ సుబ్బారెడ్డి తీవ్ర స్థాయిలో రుచుకుపడ్డారు. . దీనికి స్పందనగా శేఖర్ రెడ్డికి మద్దతుగా ఉదయగిరి మైనార్టీ నేతలు తిరిగి సుబ్బారెడ్డి పై భారీ స్థాయిలో ధ్వజమెత్తారు. వీరికి సమాధానం ఇస్తూ మరల సుబ్బారెడ్డి కార్యాలయంలో మరో మైనార్టీ బ్యాచ్ వారిపై పంచులు విసరడంతో ఒక్కసారిగా ఉదయగిరి రాజకీయాల్లో పాత వినోదం నెలకొంది. గత అసెంబ్లీ ఎన్నికల ముందు శేఖర్ రెడ్డి పార్టీ మారిన సందర్భంగా సుబ్బారెడ్డి శేఖర్ రెడ్డి మధ్య భారీ స్థాయిలో సవాల్ యుద్ధం నెలకొంది .ఈ సందర్భంగా శేఖర్ రెడ్డి ఉదయగిరి సెంటర్లో బైఠాయిస్తానని సంగతి తేలుస్తాని హెచ్చరికలు చేసి అక్కడికి వచ్చిన నేపద్యంలో ఉదయగిరిలో తీవ్ర ఉత్కంఠ ఉద్రిక్తత నెలకొన్నాయి. ఈ సందర్భంగా శేఖర్ రెడ్డి సుబ్బారెడ్డి ల మధ్య వ్యక్తిగత విమర్శలు హోరు ఎత్తించి జిల్లా స్థాయిలో చర్చ నీయాంశమయ్యాయి. గత రెండు సంవత్సరాలుగా మాటల తూటాలకు దూరంగా ఉన్న ఉదయగిరి లో శేఖర్ రెడ్డి కాకాణి కి వ్యతిరేకంగా చేసిన ప్రకటనతో విమర్శల యుద్ధం భారీగా మొదలైంది. కాకర్ల సురేష్ ఎమ్మెల్యే అయ్యాక ప్రత్యర్థి వైసీపీ నేతల నుండి ఇలాంటి ప్రకటనలు ఇప్పుడు లేని తరుణంలో సురేష్ కూడా సంయమనంగా తన పథకాలు తన అభివృద్ధి అంటూ ప్రత్యర్థి వైపు దృష్టి పెట్టింది తక్కువే అని చెప్పవచ్చు. గత రెండు సంవత్సరాలలో పోలిస్తే కేవలం ఒకటో రెండుసార్లు సురేష్ బహిరంగంగా రాజగోపాల్ రెడ్డి తీరుపై అభ్యంతర వ్యక్తం చేయడం తప్ప ఎలాంటి వ్యక్తిగత విమర్శలకుపోలేదు. రాజగోపాల్ రెడ్డి కూడా విమర్శలు సాంకేతికంగానే చేశారు.దీనితో ఇరు వర్గాల అనుచరులు కూడా ఇటువంటి విమర్శలకు వివాదాలకు దూరంగా ఉండిపోయారు. ప్రస్తుతం శేఖర్ రెడ్డి చురకలతో సుబ్బారెడ్డి ఆజ్యం పోయగా గత మూడు నాలుగు రోజులుగా ఇరుపక్షాల మధ్య భారీ మాటల యుద్ధం మళ్లీ మొదలైంది. సోమిరెడ్డి కాకాణి ల అంశం పూర్తిగా పక్కకు పోయి శేఖర్ రెడ్డి, శేఖర్ రెడ్డి వ్యతిరేక వర్గ వ్యవహారం తెరపై విమర్శల వాన కురిపిస్తోంది. ఇప్పటికి ఉదయగిరి మండలానికే పరిమితం అయిన ఈ వ్యవహారంలో అద్భుతమైన పంచ్ లు కురిపించే వింజమూరు బ్యాచ్ ఇంకా అడుగిడక పోవడం కొంత వరకు...ఉపశమనమే. మిగిలిన మండలాల తో పోలిస్తే ఉదయగిరి, వింజమూరు బ్యాచ్ లదే ఈ ప్రకటనల పంచ్ లలో అగ్రస్థానం. - సీనియర్ జర్నలిస్ట్, జయప్రతాప్ రెడ్డి, నెల్లూరు.


No comments
Post a Comment