Saturday, 13 June 2026

కావలి ఆంధ్ర జ్యోతి విలేఖరి కి లోకం పోకడ అవార్డు..

కావలి ఆంధ్రజ్యోతి విలేఖరి అబ్దుల్ నవీద్ కు లోకం పోకడ వ్యవస్థాపకులు రామచంద్రుని రామచంద్ర రావు అవార్డు లభించింది. కావలి రోటరీ క్లబ్ వేదికగా ఈ ... thumbnail 1 summary



కావలి ఆంధ్రజ్యోతి విలేఖరి అబ్దుల్ నవీద్ కు లోకం పోకడ వ్యవస్థాపకులు రామచంద్రుని రామచంద్ర రావు అవార్డు లభించింది.

కావలి రోటరీ క్లబ్ వేదికగా ఈ అవార్డును రోటరీ గవర్నర్ డాక్టర్ మాధవరెడ్డి, అధ్యక్షుడు రమే‌ష్ రెడ్డి ఆధ్వర్యంలో రామచంద్ర రావు కుటుంబ సభ్యులు అందచేశారు. రోటరీ మాజీ అధ్యక్షుడు గా రామచంద్ర రావు చేసిన సేవలను రొటేరియన్ కొండల్ రావు 

ఈ సందర్భంగా వివరించారు.  పత్రికా సంపాదకుడు గా రామచంద్ర రావు కావలిలో తనకంటూ ఒక ప్రత్యేకతను నిలబెట్టుకోవడం విశేషమని, ఆయన పేరు ను సార్ధకం చేస్తూ వారి శ్రీమతి భారతి కుటుంబ సభ్యులు ప్రతి ఏటా ఉత్తమ జర్నలిస్టు కు పదివేల రూపాయల నగదు బహుమతి అందచేయడం విశేషమని సీనియర్ జర్నలిస్టు జయప్రతాప్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ఏడాది రామచంద్ర రావు అవార్డు అందుకున్న ఆంధ్ర జ్యోతి కావలి విలేఖరి అబ్దుల్ నవీద్ జర్నలిస్టు గా సమాజానికి తన వంతు సేవలు అందిస్తున్నారని కొనియాడారు.

యువ జర్నలిస్టులగానే కాక ఫుట్ బాల్ కోచ్ గా, రాజకీయ విశ్లేషకుడిగా నవీద్ ఈ అవార్డు కు నూరు శాతం అర్హులని ప్రతాప్ రెడ్డి ప్రశంసిస్తూ సన్మాన పత్రం అందించారు. తన సేవలను గుర్తించి రామచంద్రరావు స్మారక అవార్డును అందించడం పట్ల నవీద్ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమం లో రామచంద్ర రావు అవార్డు కమిటీ సభ్యులు నున్నా మురళి, వివిధ రంగాలకు చెందిన పట్టణ ప్రముఖులు నవీద్ ను ఘనంగా సత్కరించారు.

No comments

Post a Comment

BTemplates.com