Tuesday, 24 March 2026

శంకర మఠం ను మార్చిన ఘనత ఆయనదే

శంకర మఠం ను మార్చిన ఘనత ఆయనదే పొన్నలూరు సుబ్రహ్మణ్యం కలిగిన నివాళి కావలి, మార్చి-23) కావలి పాత ఊరు లోని శంకరమఠం గౌరవ అధ్యక్షులు, పూర్వ ... thumbnail 1 summary
శంకర మఠం ను మార్చిన ఘనత ఆయనదే పొన్నలూరు సుబ్రహ్మణ్యం కలిగిన నివాళి కావలి, మార్చి-23)

కావలి పాత ఊరు లోని శంకరమఠం గౌరవ అధ్యక్షులు, పూర్వ కార్యదర్శి శంకరమఠం భవనాన్ని జీర్ణోద్ధరణ కావించి అతి సుందరంగా తీర్చిదిద్దిన అపర భగీరథుడు మహనీయులు పొన్నలూరి వేంకట సుబ్రహ్మణ్యం సంస్మరణ సభ లో ఘనంగా నివాళులు అర్పించారు.. విశ్రాంత ప్రధానోపాధ్యాయులు చలంచాల సూర్య ప్రకాష్ రావు మాట్లాడుతూ కావలిలో శంకర మఠాన్ని జీర్ణోద్ధరణ చేసి ఇక్కడ ఎన్నో ధార్మిక కార్యక్రమాలను నిర్వహించారని, వారు నిర్వహించిన ఎన్నో సామూహిక వ్రతాలు ఇతర కార్యక్రమాలను గుర్తు చేసుకుంటూ వారు లేని లోటు తీర్చలేనిదని వారి ఆశయాలను నెరవేర్చాలని అన్నారు. అనంతరం గుండు కోటేశ్వరయ్య మాట్లాడుతూ శంకరమఠంలో ఎన్నో ధార్మికో ఉపన్యాసాలు నిరంతరం జరుగుతూ ఉండేవని అవి మళ్లీ కొనసాగించాలని దానికి తమ వంతు సహకారం అందిస్తానని అన్నారు.

ప్రస్తుత శంకరమఠం అధ్యక్షులు కసవరాజు శ్రీనివాస శర్మ , మాట్లాడుతూ వారు తమకు అప్పగించిన బాధ్యతలను వారు నిర్వహించిన స్థాయిలో నిర్వహించడానికి తాను కూడా కృషి చేస్తానని అన్నారు.. కార్యదర్శి గణపతిరాజు మారుతి రామారావు మాట్లాడుతూ సుబ్రహ్మణ్యం తమకి ఇచ్చిన బాధ్యతలను ప్రణాళిక బద్ధంగానే తాము కూడా నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఉపాధ్యక్షులు టంగుటూరి ప్రకాష్ రావు, శంకర మఠం ప్రధాన అర్చకులు తెలికేపల్లి రామచంద్రయ్య, సహాయ అర్చకులు మల్లికార్జున శర్మ, సీనియర్ పాత్రికేయులు జయప్రతాప్ రెడ్డి, బ్రాహ్మణ సంఘ అధ్యక్షులు పురాణం ప్రసాద్, రిటైర్డ్ ఎండిఓ రేవూరి కళాధర్, రంగస్థలం నటుడు నల్లూరి రామకృష్ణ, దొడ్ల సదాశివ రెడ్డి , నందనవనం మధు, విశ్రాంత బ్యాంకు ఉద్యోగి చంద్రశేఖర్, మద్దాలి సత్యనారాయణ ,తదితరులు పాల్గొన్నారు..తన తాత గారి ఆశయాల మేరకు ఆధ్యాత్మిక సేవలు అందిస్తానని వేదాంత ఉపాధ్యాయులు , సుబ్రహ్మణ్యం మనుమడు శరత్ పేర్కొన్నారు.

No comments

Post a Comment

BTemplates.com