Tuesday, 28 April 2026
కావలి జె.బి పూర్వ విద్యార్థి....కలిగిరి వాసి.. ఆకస్మిక మృతి..
డాక్టర్ కృష్ణమూర్తి ఆకస్మిక మృతి..
కలిగిరి వాసి.. కావలి జె.బి పూర్వ విద్యార్థి....
జయప్రతాప్ రెడ్డి కావలి బ్యూరో, ఏప్రిల్ (కావలిమైల్.కామ్ ప్రతినిధి)
కలిగిరి మండల వాసి, కావలి జవహర్ భారతి విద్యార్థి డాక్టర్ బడుగు కృష్ణ మూర్తి గుండెపోటుతో మరణించారు.
ప్రభుత్వ వైద్యుడిగా అందరి ప్రశంసలు అందుకున్న ఆయన ప్రభుత్వ బ్లడ్ బ్యాంక్ ఇన్చార్జి గా ఎన్నో రక్తదాన శిబిరాలు భారీ గా నిర్వహించారు. ఆయన చొరవ కి ఒక దశలో రెడ్ క్రాస్ కూడా తట్టుకోలేక ఆయనను బలవంతంగా ఆ బాధ్యతల నుంచి తప్పించారు. కలిగిరి మండలం అన్నలూరికి చెందిన కృష్ణ మూర్తి కావలి జవహర్ భారతి లో 80-82 లో బైపిసి చేసి అనంతరం వైద్య కోర్సు కు వెళ్లారు. పేద ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించే కృష్ణ మూర్తి లౌక్యం తెలియక ముక్కు సూటిగా పోయే వ్యక్తి కావడంతో ఆయన కొందరి లా మనుగడ సాగించ లేక పోయారు. సామాన్య మధ్యతరగతి కి చెందిన కృష్ణ మూర్తి తన ప్రతిభతో ఆ రోజుల్లో వైద్య కళాశాల లో సీట్ పొంది ఆ రంగానికి సేవలు అందించారని పలువురు ఆయన సేవలను గుర్తుకు తెచ్చుకుంటున్నారు.
Subscribe to:
Post Comments (Atom)

No comments
Post a Comment