శ్రీమానినీ మందిరా! భక్తమందారా!
త్రైలోక్య సమ్మోహనాకారా! ప్రేమావతారా!
జగన్నాధా! లోకాధినాధా! మత్త్సావతారుండవై సోమకుంద్రుంచి వేదాళి రక్షించి, దేవాసురుల్ క్షీర వారాన్నిధిన్ ద్రచ్చగా గోర, కూర్మావతారుండవై మందంరంబెత్తి శ్రీ మోహిని వేష ముంబూని పీయూషదానంబు గావించి, వారాహ రూపంబునన్ భంగ పాటొందు భూదేవి రక్షించి, ఈనాడు నీ తత్వముల్ నమ్మగా లేని అజ్ఞానికిన్ సత్యదీపంబు చూపించి, మోహంబు వారించి నీ విష్ణు భావంబు రూపించి, నీదాసకోటిన్ కటాక్షింపగా ఈ విచిత్రా కృతింబూని వేంచేసినావా పరంధామా! వైకుంఠధామా!
నమో! నారసింహా! నమో! భక్తపాలా! విధాతాదులే వెరుగు చెందు నీ ఉగ్రరూపమూ ఉపశమింపుమా!
త్రిలోకాలకూ ప్రియంబైన నీ
ప్రసన్నాకృతి ప్రసాదింపుమా!
ఓం నమో నారసింహాయ నమః 🙏🙏🙏🙏🙏
Sunday, 15 March 2026
శ్రీమానినీ మందిరా! భక్తమందారా! త్రైలోక్య సమ్మోహనాకారా! ప్రేమావతారా!!
Subscribe to:
Post Comments (Atom)

No comments
Post a Comment