Saturday, 13 June 2026

ప్రతాప్ కుమార్ రెడ్డికి పోలీసునోటీసు

కావలి మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి పోలీసులు శుక్రవారం నోటీసులు అందజేశార... thumbnail 1 summary

కావలి మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి పోలీసులు శుక్రవారం నోటీసులు అందజేశారు. 

ఇటీవల నిర్వహించిన విలేకరుల సమావేశంలో చేసిన రాజకీయ విమర్శల నేపథ్యంలో కూటమి ప్రభుత్వానికి చెందిన నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు

ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు  కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఈ సందర్భంగా కావలి 1వ పట్టణ ఎస్‌ఐ సుమన్, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. సోషల్ మీడియాలో విపరీతంగా మాట్లాడలేని భాషలో మమ్ములను మా నాయకులను పోస్టులు చేస్తున్న వారిపై ఫిర్యాదు చేస్తే ఆ కేసులు మాత్రం కట్టకుండా రెడ్ బుక్ రాజ్యాంగం లో భాగంగా మా మీద కేసులు కట్టి వేధింపులకు గురి చేస్తున్నారని ప్రజలు అన్ని గమనిస్తున్నారని సరైన సమయంలో వీరికి తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజల సిద్ధంగా ఉన్నారని ప్రతాప్ రెడ్డి అన్నారు.

No comments

Post a Comment

BTemplates.com